MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె ఎల్కతుర్తి లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపై మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ..
తెలంగాణ ఉనికిని కోల్పోతున్న సమయంలో కేసీఆర్ పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంతో అందరినీ ఒక్క తాటికి పైకి తెచ్చి తెలంగాణ ను ఉనికి కాపాడాడన్నారు. 2001లో కేసీఆర్ పెట్టిన తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తిచేసుకుందని తెలిపారు. వరంగల్ గడ్డ అంటే ఉద్యమాల గడ్డని, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని.. వరంగల్ లో సభ పడితే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేసారు.
ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లల్ని మోసం చేసిందని.. స్కూటీలు ఇస్తామని విద్యార్థులు మోసం చేసారని అన్నారు. అలాగే బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసారని తెలిపారు. ఇలా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మహిళలు సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. తెలంగాణ తలపై కాలేశ్వరం నిర్మించి రైతన్నకు మరోసారి ఇచ్చిన కేసీఆర్ కు మద్దతుగా రైతన్నలు పెద్ద ఎత్తున సభలో పాల్గొనలన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది చనిపోతే ఒత్తిడి మేరకు మాత్రమే తెలంగాణ ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేస్తుంది కుట్రలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ కుట్రలన్నిటిని పటాపంచలు చేయాలంటే ఈ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
కేసిఆర్ మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించే లాగా రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత ఉందని, ఎల్కతుర్తి సభలో ప్రత్యేక మహిళా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నమని, సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అవ్విడా తెలిపారు. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. ప్రజలకు నీ మోసం ఏంటో తెలిసిపోయిందని, 16 నెలల్లోనే మీరు ఏమి చేయలేరని తెలంగాణ ప్రజలకు తేలిపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల్లారా అవాకలు చెవాకులు పేలుస్తున్నారు. మా సభలో పల్లీలు, బఠానీలు అమ్ముకునే అంత మంది కూడా మీరు ఉండరు. అవాకులు, చివాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. రూపాంతరం చెందడం అనేది సర్వసాధారణం.. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం మాత్రమే చెందింది.. పార్టీ మారలేదని ఆవిడ మాట్లాడారు.