ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత, పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ “తెలంగాణ నాయకుల దిష్టి…
‘జాగృతి జనం బాట’లో భాగంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను తొలగించడంపై స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడానికి కవిత తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నా అని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నా అని, చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నల్లగొండకు కల్వకుంట్ల…
Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.
Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు. జాగృతి…
Jagruthi Foundation Day 2025: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ఉట్టి దర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం అని, కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత…
BRSV Student Meet: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్వి (BRSV), తెలంగాణ జాగృతి సంస్థలు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రెండు సంస్థలూ విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే లక్ష్యంగా సెషన్లను ప్లాన్ చేశాయి. హైదరాబాద్ ఉప్పల్ లోని మల్లాపూర్ VNR గార్డెన్స్ లో ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి “తెలంగాణ విద్యార్థి సదస్సు” జరగనుంది. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ…
Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ టీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూలై 12న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంతర్జాతీయం, సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ smt. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి మల్లన్న…
MLC Kavitha : తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తే ఆడబిడ్డలను అమ్మవారిలా చూస్తామన్నారు. అలాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ బాధ్యత…