జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. మహిళ రిజర్వేషన్ అంశము రాజకీయం చేయడానికి కాదని, ఈ సర్కార్‌కు పూర్తి బలం ఉందని, మోడీ సర్కార్ అనుకుంటే రెండు గంటల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం
రాజకీయ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచాలని ఆమె అన్నారు. ఢిల్లీలో దీక్ష పూర్తయిందని, ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షలు చేస్తామన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్ధమే ముందు ఉంటుంది. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షలు చేస్తామని ఆమె వెల్లడించారు.
Also Read : NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా