ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ గురువారం రాత్రి తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ లో తెలియజేశారు. దీంతో కమిన్స్ కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల క్రికెట్ అభిమానులు ప్యాట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆసీస్ ప్లేయర్స్ అందరు ప్యాట్ కమిన్స్ తల్లికి నివాళిగా తమ చేతికి నల్లటి ఆర్మ్ బ్యాడ్జ్ ధరించి మైదనాంలోకి దిగారు.
Read also : NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ట్విట్టర్ వేదికగా ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటించింది. మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేమంతా చాలా బాధపడుతన్నామంటు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తరపున ప్యాట్ కమిన్స్ తో పాటు అతని కుటుంబం, స్నేహితులకు మా ప్రగాధ సానుభూతిని తెలుపుతున్నాం.. ఆమె గౌరవార్థం ఆసీస్ టీమ్ మ్యాచ్ లో నల్లి ఆర్మ్ బ్యాడ్జ్ ధరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు టీమిండియా క్రికెట్ బోర్డు సైతం కమిన్స్ తల్లి మరియా మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది.
Read also : Today Stock Market Roundup 10-03-23: ఆర్థిక సంస్థల షేర్లు లబోదిబో
భారత క్రికెట్ తరపున మరియా మరణంపై చాలా బాధపడుతున్నాం.. కష్టకాంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది అని బీసీసీై తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. అయితే ఆమె గత కొంత కాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారడం వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడే భారత్ లో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ తన తల్లి కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు.
Read also : Cricket : డొమెస్టిక్ లీగ్స్ తో.. ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ప్రమాదం!
ఇక, అప్పటి నుంచి దగ్గరుండి తల్లి బాగోగులు ప్యాట్ కమిన్స్ చూసుకుంటున్నాడు. మూడు టెస్టు ప్రారంభమయ్యే సమయానికి అతడు తిరిగి వస్తాడని భావించినప్పటికి తల్లీ ఆరోగ్యం మెరుగుపడకపోవడం వల్ల అతను అక్కడే ఉండిపోయాడు. అలా నాలుగో టెస్టుకు కూడా ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. రెండు టెస్ట్ సమయంలో ప్యాట్ కమిన్స్ వెళ్లిపోయిన తర్వాత అతని స్థానంలో మరో జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే వన్డే టీమ్ కు కూడా కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని తల్లి మరణంతో ఆ సిరీస్ కు దూరమయ్యే అవకాశలున్నాయని అభిమానులు అంటున్నారు.
Read also : BRS Meeting: బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం