తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఒకరు కేసీఆర్ మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఉన్న యువతి యువకులు దేశం గురించి ఆలోచించాలని, దేశంలో మేధావులు మాట్లాడడం మానేశారన్నారు. రచయితలు ఎందుకోసం రాయాలి ? ఎవరి కోసం రాయాలని ఆలోచన చేసే పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు. దేశంలో మేధావి వర్గం అసంతృప్తితో ఉందని, దేశవ్యాప్తంగా జాగృతి సంస్థ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్కార్లను బిజెపి సర్కార్ కూల్చివేస్తే… దీని గురించి జాతిని మనం జాగృతి చేయకూడదా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం కాపాడితే… అవి మనల్ని కాపాడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Bandi Sanjay : ధాన్యం సేకరణలో కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే
దేశంలో విపక్షాలపై దాడినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మరోసారి తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందామని ఆమె అన్నారు. భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకుందామన్నారు. తెలంగాణ చైతన్యాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని, ప్రతి రాష్ట్రంలో ఉన్న కవులను, కళాకారులను, రచయితలను, విద్యార్థులను, మహిళలను రైతులను ఏకం చేస్తామన్నారు కవిత. తెలంగాణ జాగృతి ఒక ప్రభలమైన శక్తిగా ఉందని, దాడులు చేస్తా ఉన్నారు… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదే దారి అని, దాడులు చేసిన వెనక్కి తగ్గేది లేదని ఆమె ఉద్ఘాటించారు. తెలంగాణ ఆడబిడ్డ కళ్ళల్లో నుంచి నీళ్లు రావు …నిప్పులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.