MLC Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఖండిస్తూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Read Also: IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..!
ఈ సందర్బంగా ఆమె, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేటతెల్లమైందని అన్నారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అంటూ తెలిపారు.
Read Also: IPL Update: బెంగళూరు టూ లక్నో.. మరో ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు..!
ఇది రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయి. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునాట్లు ఆమె రాసుకొచ్చారు. చూడాలి మరి నేడు జారీ అయినా నోటీసులకు ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారో నాయకులు.
ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
అది కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 20, 2025