IPL Update: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య గ్రూప్ మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ మ్యాచ్ మొదట బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండగా.. తాజా సమాచారం మేరకు మ్యాచ్‌ను లక్నోకు మార్చినట్టు తెలుస్తోంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్‌ను ఇప్పుడు లక్నోలో ఆడాల్సి వస్తోంది. దీంతో కోహ్లికి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అభిమానులు బెంగళూరులో ఇచ్చే అభినందనల అవకాశాన్ని కోల్పోయారు. మొత్తానికి ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Read Also: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!
తాజాగా బెంగళూరులో వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో, మే 23న కూడా వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున బీసీసీఐ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. మే 17న చిన్నస్వామిలో జరగాల్సిన ఆర్సీబీ, కోలకతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్‌ను తక్షణమే వేదిక మార్చాలని నిర్ణయించింది. ఆర్సీబీ ఇప్పటికే 12 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక SRH ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయినా సంగంతి తెలిసిందే.
Read Also: HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో హువావే నోవా 14 సిరీస్ లాంచ్..!
ఇక ఇప్పటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య 25 మ్యాచ్‌లు జరగగా అందులో SRH 13 విజయాలు సాధించగా, RCB 11 గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈ వేదిక మార్పుతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. లక్నో వేదికగా వర్షాభావం ఉండే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభిమానులు పూర్తి స్థాయిలో మ్యాచ్‌ను ఆస్వాదించగలిగే అవకాశం ఉంది.