కరీంనగర్ బీజేపీ ఆఫీసు లేదా హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు ముందు కరెంటు తీగలు పట్టుకో బండి సంజయ్.. 24 గంటలు తెలంగాణ సర్కార్ కరెంటు ఇస్తుంది… లేనిది తెలుస్తుంది అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అయితే.. ఇవాళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఎంపీ అరవింద్ ప్రజలను, సొంత పార్టీ నేతలను మోసం చేస్తారని, నిజామాబాద్ నుంచే నేను ఎంపీగా పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేసిన ఒడిస్తానని ఆమె సవాల్ చేశారు. నిజామాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మోడీ సర్కార్ నుంచి ఎటువంటి సహకారం లేదని, నిజామాబాద్ ఎంపీ ఒక్క సారి తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. ధర్మపురి అరవింద్ కు ఎందుకు అంత అక్కసు ? నిజామాబాద్ యువతకు ఐటీ జాబ్స్ వస్తే? అని ఆమె ప్రశ్నించాఉ. నిజామాబాద్ లో అన్ని సీట్లు బీఆర్‌ఎస్ గెలుస్తుందని ఆమె ఉద్ఘాటించారు.
Also Read : CP Ranganath : ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలి
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు నిజామాబాద్ ఐటీ హబ్ కార్యకలాపాలపై అవగాహన లేదు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాపై అవహేళన చేస్తున్న బిజెపి ఎంపి బండి సంజయ్‌ను బిజెపి కార్యాలయంలోని స్విచ్‌బోర్డ్‌లో తన వేలు ఉంచి, ఎప్పుడైనా రౌండ్ ది క్లాక్ సరిచూసుకోవాలని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. అరవింద్ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోవచ్చని, డిపాజిట్ కోల్పోతారని, బదులుగా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని ఆమె సూచించారు.
Also Read : Hawaii Wildfire: హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 36 మంది మృతి
టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో నూతనంగా ప్రారంభించిన ఐటి హబ్ స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలకు తలుపులు తెరిపిస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ఆరోపణలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్ష నేతలు తమ మాటలను పట్టించుకోవాలని, విఫలమైతే బీఆర్‌ఎస్ శ్రేణులు సమానంగా స్పందిస్తారని సూచించారు.