NTV Telugu Site icon

MLC Kavitha: మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

Kavitha

Kavitha

MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో ప్రపంచ బ్యాంకు నుంచి ఋణం అడిగినట్టుగా నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని కవిత అన్నారు.

Also Read: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు

అసెంబ్లీలో డీపీఆర్ లేనట్టు చెప్పిన మంత్రి, సెప్టెంబర్ 19 న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఎవరి లాభం కోసం ఇది జరుగుతుందో ప్రజలకు స్పష్టత ఇవ్వండని ఆమె చెప్పారు. కవిత మరింతగా మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకును కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేసిందని ఆవిడ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు చెప్పేది వేర్వేరుగా ఉందని ఆమె విమర్శించారు.

Also Read: Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు

కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 14 వేల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి మూసీ కోసం అడిగారని ఆవిడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి వేర్వేరు వాదనలు చెప్తోందని కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోంది. మూసీ ప్రాజెక్టు పై అబద్ధాలు ఆడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. మూసీ పేరు మీద పేదల ఇండ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేస్తున్నట్లు కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచేలా కనిపిస్తున్నాయి.

Show comments