CM Revanth Reddy : ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు. ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, గడ్డం వినోద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వాగతం పలిచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్…
Bhatti Vikramarka: వస్తువులు, సేవల పన్ను (GST) రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జీఎస్టీ పన్నుల తగ్గింపు, దాని ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరాలనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని స్పష్టం చేశారు. Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళ దారుణ హత్య.. అత్యాచారం చేశారా? విధానపరమైన నిర్ణయాలు ఎన్ని…
Indiramma Canteen : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా…
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం. పల్లె నుంచి పట్నం వరకు, దేశధినేతల నుంచి విదేశీయుల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై సీఎం స్పందించారు. "నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు." అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. చాలా విషయాలను…
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
CM Revanth Reddy : తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని…
Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి…
హైదరాబాద్ నగరంలోని ఘాట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
బెట్టింగ్ యాప్స్ వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.. వీళ్ళ ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు.. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని.. మీరు సంపాదించుకున్న సంపాదనను కనీసం చారిటీల ద్వారా ఖర్చు చేయాల్సిందన్నారు. మీకు ఎందుకు ఇంత…