అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం.…
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో…
Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలిస్తూ సిట్ విచారణ వేగంగా సాగే అవకాశముంది. అక్రమాలకు అండదండగా ఉన్న పెద్దలపాత్ర త్వరలో బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులలోనూ కాకినాడ పోర్టు వివాదాలతో చిక్కుకుంది. కాకినాడ…
కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు.