యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులోని ఏఎన్ ఆర్ గార్డెన్ లో విహవాకార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ఏర్పాటుకు అండగా నిలబడ్డారో… ఇప్పుడు కూడా అదే విధంగా అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని దుష్ప్రచారాలు, ఇబ్బందులకు గురి చేసినా ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని, ఉంటారని ఆమె అన్నారు.
Also Read : CM KCR : చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది
తన ఇంట్లో పని చేసే మహేష్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి ఆలేరు కు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా ప్రపంచానికే తలమానికంగా మారిందన్నారు. ఉద్యమం జరిగినా, ఎన్నికలు జరిగినా ప్రజలు ఎప్పుడు టిఆర్ఎస్ నే కోరుకుంటారని ఆమె అన్నారు. టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ పాలన తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆమె స్పష్టం చేశారు.
Also Read : Crime News: చోరీకి వచ్చాడని అనుమానించి.. చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు..