తెలంగాణ సంస్కృతి ఎంతో ఉన్నతమయిందన్నారు ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడుతున్న పదజాలం అవమానంగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆయన పదవికి వన్నె తెచ్చేలా లేదు. బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడుతున్నారు. నా పట్ల మాట్లాడుతున్న భాషకు బాధ పడుతున్నా అన్నారు కవిత. చిట్ చాట్ లో కవిత మాట్లాడారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. నిన్న కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. బండి సంజయ్ భాష ఆయన పదవికి మచ్చ తెచ్చేలా ఉందన్నారు కవిత.
Read Also: Udhayanidhi Stalin: మంత్రి కాబోతున్న యంగ్ హీరో!
మోడీ నుంచి బండి సంజయ్ వరకు మహిళను అవమానించే సంస్కృతి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపిని సరైన సమయంలో తిప్పికొడుతారన్నారు. నా పట్ల బండి సంజయ్ కామెంట్స్ పై బాధ పడుతున్నా అన్నారు. బతుకమ్మ పండగ వెనుక నా 12 ఏళ్ల కష్టం ఉందన్నారు. అది డిస్కో డాన్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. అభివృద్ధి లో బిజెపి నీ కౌంటర్ చేస్తాం. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఅర్ ఉన్నారు. కేసీఅర్ రాష్ట్రంలో బాధ్యత ఎవరికి ఇస్తారో అన్నది సస్పెన్స్ అన్నారు.
తెలంగాణలో తెలంగాణ జాగృతి ఉంటుంది…భారత జాగృతి పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఉంటుంది. తెలంగాణ జాగృతి,భారత జాగృతి సంస్థలు కలిసి పనిచేస్తాయి. జాతి వ్యతిరేకులు,అర్బన్ నక్సలైట్ అంటూ ముద్ర వేయడం దారుణం అన్నారు కవిత. తెలంగాణలో షర్మిల అస్థిత్వం లేదు. ఆమెని షర్మిల పాల్ అనే చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు కవిత. బిజెపి నీ గద్దె దించేందుకు కలిసి వచ్చే పార్టీలతో జాతీయస్థాయిలో కలిసి పని చేస్తాం అన్నారు.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి BRS నిర్ణయాలు ఉంటాయి. భారత్ జొడో యాత్ర వర్కవుట్ అయితే మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అలా ఉండేదా ? ఎన్డీఏ కు ఇప్పుడు మిత్రులు ఎవరు ఉన్నారు ? బిజెపి కి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తాము…వారికి లాభం జరిగేలా ఒక్క నిర్ణయం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల తీరును చూసి ప్రజలు నవ్వు కుంటున్నారు. బిజెపి రణనీతి లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులు ఒక భాగం. విపక్షాలు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. షర్మిల ,కే ఈ పాల్ ,అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లు కమల బాణాలు అని ఆరోపించారు.
Read Also: Minister KTR: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం