కరోనా తర్వాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా వుందన్నారు మంత్రి కేటీఆర్. ఢైపుక్ తెలంగాణలో 450 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. కరోనా తర్వాత అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. చైనాలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి అనేక దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది. చైనా అలా కాదన్నారు.
Read ALso:Prashant Reddy: రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఢిల్లీ ఆఫీస్ ప్రారంభం
జపాన్ లో మ్యూజియం వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున యూనిఫాంలో ఉన్న పాఠశాల పిల్లలు కనిపించారు. అక్కడ ఉన్నవారిని అడిగాను.. కార్లు డిజైన్ చేస్తున్నారు కలర్స్ తో అని చెప్పారు. అంటే అక్కడ పిల్లలు చిన్నతనం నుంచి ఆలోచన విధానాన్ని పెంచుతారు. జపాన్ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించుకునే ముందుకు వెళ్తుందన్నారు. ప్రపంచం ఇవాళ చైనా కాకుండా ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాట్లకు చూస్తున్నారు. మన దగ్గర బాసర IITవిద్యార్థులకు అద్బుతమైన టాలెంట్ ఉంది. IIT తో ఒప్పందం చేసుకోండి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ తెలంగాణ ప్రభుత్వం కలిసి రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామిక పార్క్ దండుమైలారంలో తీసుకొచ్చిందన్నారు మంత్రి కేటీఆర్.
పరిశ్రమల శాఖ మంత్రిగా నేను ఒకటి చెప్తున్నాను..ఎందుకు మన దగ్గరనుంచి వరల్డ్ స్థాయి ప్రొడక్ట్స్ రాలేకపోతున్నాయి. మనం జపాన్, కొరియా, చైనా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మీ దగ్గర మంచి ఐడియా ఉంటే క్యాపిటల్ అనేది పెద్ద కష్టం కాదు. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వరల్డ్ స్థాయి ప్రొడక్ట్స్ తీసుకొచ్చేందుకు మన పారిశ్రామిక వేత్తలు ప్రయత్నం చేయాలన్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లోని చందనవల్లిలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది దైఫూకు ( Daifuku) కంపెనీ. దీని ద్వారా ఎనిమిది వందల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కలగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దైఫూకు ( Daifuku) సంస్థను సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.
Read Also: AHA: ఓటీటీలో ‘వాళ్ళిద్దరి మధ్య’! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!