వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్నటి వరకు మా సహచరుడు.. కోటంరెడ్డి కి నా సవాల్.. నీ ముఖానికి రంగు, రూపు రావటానికి కారణం వైఎస్ జగన్. ఆయన ఇచ్చిన టికెట్ పై గెలిచి ఇవాళ చంద్రబాబుతో రహస్యంగా లాలూచీ పడ్డావు. సిగ్గు ఉంటే, మగాడివి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అన్నారు సుధాకర్ బాబు. నెల రోజుల ముందే నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకు వచ్చింది. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో నీ నియోజకవర్గ అభివృద్ధి ఎంత జరిగింది?? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: RS Praveen : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయండి.. లేకపోతే నిరహార దీక్ష చేస్తా
జగన్ నీ నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఎంత నిధులు ఇచ్చారో చర్చకు రా. నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు. చెప్పులు వేసుకోవటం మరిచిపోయి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళాడు. మేం దాడి చేశాం అనటం పచ్చి అబద్ధం. ఉదయం నుంచి ఆయన కాళ్ళు, చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఆయన పట్టుకున్న కాగితం చేతిలో నుంచి జారిపోతే తీసుకుని వెళ్ళి స్పీకర్ కు హ్యాండ్ ఓవర్ చేశాం అన్నారు సుధాకర్ బాబు.
Read Also: Mumbai Female Cop: ‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి