TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎక్సమ్ ను 48 గంటల్లో రద్దు చేయకపోతే అమరణ నిరహార దీక్షకు దిగుతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గతంలో తాను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ గా పని చేశానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించాడు. చైర్మన్ కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు ఎలా తెలుసని ఆయన ప్రశ్నించారు. దొంగిలించేంత ఈజీగా పాస్ వర్డ్ బయటపెడతారా అంటూ మండిపడ్డారు. 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనిపై వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరుతున్నట్లుగా ఆయన చెప్పారు.
Also Read : Gopireddy Srinivas Reddy: బాలయ్యకు సవాల్.. మా ఊరి గొడవలతో మీకేం పని?
ప్రియురాలి కోసం లక్షాలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టిన సెక్రెటరీ పీఏ ప్రవీణ్ ఒక జులాయి, పెద్ద నేరస్తుడని విమర్శించారు. అతడికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 150కి 103 మార్కులు ఎట్లొస్తాయని టీబీఎస్పీ చీఫ్ ప్రశ్నించారు. గ్రూప్-1లో ప్రిలిమ్స్ లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలను బహిర్థతం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి.. రోజు ట్వీట్ లు పెట్టే కేటీఆర్ దీనిపై ఎందుకు స్పందించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
Also Read : Mumbai Female Cop: ‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి
తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిట్ కు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాను త్వరలోనే రాష్ట్రపతికి, గవర్నర్ కు లేఖలు రాయనున్నట్లు ఆయన చెప్పారు. తప్పకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
Also Read : Imran Khan Arrest: రణరంగంగా పాకిస్తాన్.. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, ఆర్మీ విఫలయత్నం..
గ్రూప్ -1 మెయిన్స్ కు ప్రిపేర్ అవ్వమని టీఎస్పీఎస్సీ చైర్మన్ అభ్యర్థులకు చెప్పడం సరికాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్పీఎస్సీ మీద రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. కొత్త బాడీని నియమించాలని.. అన్ని పరీక్షలు మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1ప్రిలిమ్స్ పరీక్షను 48 గంటల్లో రద్దు చేసి.. పెడతామని ప్రకటన చేయకుంటే 30 లక్షల నిరుద్యోగుల కోసం తాను హైదరాబాద్ నడిబొడ్డున అమరణ నిరహార దీక్షకు దిగుతానని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.