Mulugu: ములుగు జిల్లా నేడు అధికారిక పర్యటనకు వేదిక కానుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మంత్రులు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10:20కి ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ కాలనీకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది స్థానిక ప్రజలకు వసతుల కల్పనలో ముందడుగు కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: YS.Jagan: నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. రైతులకు పరామర్శ
ఆ తర్వాత 10:45కి ఇంచర్ల గ్రామంలోని ఎమ్మార్ ఫంక్షన్ హాల్ వద్ద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పటాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది పేద ప్రజలకు ఇంటి కల నెరవేరనున్నది. మధ్యాహ్నం 12:15 గంటలకు మంత్రులు ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామానికి వెళ్లి మధ్యాహ్నం 12:15 నుంచి 1:15 గంటల వరకు భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొననున్నారు.
Read Also: Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
ఆ తర్వాత మంత్రులు మధ్యాహ్నం 2 గంటలకు ములుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో లంచ్ చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులు ఊపందుకునే అవకాశం ఉంది.