జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోస్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) కింద కీలకమైన మూడు బ్యారేజీలలో కనీసం రెండింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది . రెండు సీజన్‌లుగా గోదావరి నీటిని కోల్పోయిన రైతులు, తమ ప్రజాప్రతినిధులతో కలిసి, KLIS కింద ఆయకట్టుకు ఏకైక ఆధారమైన గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది నుండి సంభావ్య ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి పంపింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. , కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గవలసి వచ్చింది, అయితే…
ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు.
వలం కమీషన్ల కక్కుర్తి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కట్టారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు అయ్యిందని.. కాళేశ్వరం మొత్తం పూర్తి కావడానికి రూ. లక్షా 47 వేల కోట్లు అవసరం అవుతాయని కాగ్ స్పష్టం చేసిందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు.
Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు.