రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కమ్యూనిటీ కళ్యాణ మండపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కసితో ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని…
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రెడి అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ప్రకటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు బయల్దేరిన పవన్ కు.. అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. మొదటగా తుర్కపల్లి దగ్గర పవన్ కల్యాణ్ కు జనసేన, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కు గజమాలతో ఘనంగా సన్మానించారు అభిమానులు. ఈ సందర్భంగా.. ఓపెన టాప్ కారు నుంచి పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ కార్యకర్తలు…
నేడు కొండగట్టు అంజన్నను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు.