Telangana Cabinet Meeting Today: తెలంగాణలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న క్యాబినెట్ సమావేశం కీలక చర్చలకు వేదిక కానుంది. ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రి వర్గం విస్తృతంగా పరిశీలించనుంది. రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాదులో భూగర్భ…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Minister Konda Surekha Apologizes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర సేపు రాజకీయాంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ సహా పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పునరుద్ధరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంది. 1. ప్రపంచంలోనే…
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్‌కు పంపిన ముసాయిదాపై చర్చించబోతోంది. సిగాచి అగ్నిప్రమాదంపై నివేదిక, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపై డిస్కస్ చేసే అవకాశం వుంది. మరోవైపు కాళేశ్వరంపై కేబినెట్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ వుంది.
తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సుదీర్ఘంగా జరిగిందన్నారు. ఈనెల 16న సీఎం చేతుల మీదుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా చెల్లించాము.. వ్యవసాయం దండగ కాదు పండగ అని చెబుతున్నాం.. రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపాము.. రేపు సెక్రటేరియట్ ముందు రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు…
నేడు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయ్యింది. నాలుగున్నర గంటలుగా క్యాబినెట్ సమావేశం కొనసాగింది. కాసేపటి క్రితమే తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీ, ఏపీ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి కార్యాచరణపై మంత్రివర్గం చర్చించింది. త్వరలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఎల్పీ లో పార్టీ నేతలకు బనకచర్ల పై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. Also Read:CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా…