తెలంగాణ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సుదీర్ఘంగా జరిగిందన్నారు. ఈనెల 16న సీఎం చేతుల మీదుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా చెల్లించాము.. వ్యవసాయం దండగ కాదు పండగ అని చెబుతున్నాం.. రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపాము.. రేపు సెక్రటేరియట్ ముందు రైతు సంబురాలు జరపాలని నిర్ణయించినట్లు…
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు.
కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.