CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
CM Chandrababu: ఉగాది లోపు 5 లక్షల గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గృహనిర్మాణ రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోందని, పేద కుటుంబాల కలల ఇల్లు ఇప్పుడు వాస్తవ రూపం…
Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని…
Anam Ramnarayana Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి…
CM Chandrababu: దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.
AP Governance: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ గా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి.. అలాగే రాబోయే రెండో ఏడాది…
పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
2014 - 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు.. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు…
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి…