టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే ఈ ఇష్యూపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి వెనుక ఎవరున్న వదిలే ప్రస్తక్తి లేదని కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డితో పాటు ఉన్న వారందరినీ కఠినంగా శిక్షిస్తామని, పేపర్ లీకేజ్ లో ఐటీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read : Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత కనీస అవగాహన ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ఐటీమంత్రిని బర్తరఫ్ చేయాలని అంటారు.. మరోకరు తనను శిక్షించాలని అంటున్నారు.. అసలు మీకు ఐటీ డిపార్ట్మెంట్ మీద కనీస అవగాహన ఉందాని ప్రతి పక్ష పార్టీలకు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read : Sleeping Disorder: సరిగా నిద్రపోవడం లేదా? అయితే ఈ రిస్క్ తప్పదు
అయితే ఈ ప్రెస్ మీట్ జరగుతున్న తరుణంలో ఓ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా అడ్డుపడటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని కేటీఆర్ అన్నారు. చెప్పే వరకు వినాలని విలేకర్ తో మంత్రి కేటీఆర్ వారించారు. నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది అని ఐటీ మంత్రి తెలిపారు. మీకు ఎలాంటి అధికారం ఉందని రిపోర్టర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల వాయిస్ అంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో ఇలాంటి పనికిమానిలిన మాటలు ఆపాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. మీడియాకు కూడా కొంత బాధ్యత ఉంది.. మీరు ఫోర్త్ ఎస్టేట్.. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా పిలవడబడుతుంది. కావునా బాధ్యతరహితంగా చేయకండి అంటూ కేటీఆర్ తెలిపారు. ఎవరో ఏదో చెప్పారని ఇలాంటి ప్రశ్నలు వేయకుడదని మంత్రి కేటీఆర్ తెలిపారు.