మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చి రెండు వారాలు కావస్తోంది. అయితే.. మరో వారం రోజులే ఉప ఎన్నిక ప్రచారానికి సమయం ఉంది. అయితే.. తాజాగా.. పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయము తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత అని, కేసీఆర్ చిన్నప్పుడు పద్మశాలీల ఇంట్లో ఉండి చదువుకున్నారని, వాళ్ళ బాధలు కేసీఆర్ కు తెలుసునన్నారు. జోలపెట్టి భూదాన్ పోచంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబలకు సహాయం చేసారని, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ చేనేత కార్మికులను ఆదుకోవాలని అప్పటి ప్రభుత్వం ను కోరారని, కానీ స్పందన రాకపోతే.. కేసీఆర్ 50 లక్షలు ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పారన్నారు. ఉమ్మడి ఏపీలో చేనేత జౌళి శాఖ బడ్జెట్ 70 కోట్లు ఉంటే …తెలంగాణ వచ్చిన తర్వాత 12 వందల కోట్లు బడ్జెట్ పెట్టాలని కేసీఆర్ చెప్పారని, చేనేత కార్మికుల డిజైన్ లను ఎవరు అయిన కాపీ కొడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నూలు, రసాయనల మీద 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక్క సర్కార్ తెలంగాణ అని, పథకం బకాయిలు ఉంటే మొత్తం విడుదల చేయిస్తామని, ఇది మీ ప్రభుత్వం… చేనేత చేయుత స్కీమ్ లో అవసరమైతే మీ కోసం మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Hyderabad Rains: భాగ్యనగరానికి భారీ వర్ష సూచన… ఈ సీజన్‌కు ఇదే లాస్ట్ అంటున్న వాతావరణ శాఖ
నిజమైన చేనేత కార్మికుల గుర్తింపు కోసం మగ్గం ల జియో ట్యాగింగ్.. ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ మగ్గాల జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేదు…తెలంగాణ చేనేత బీమా ఇస్తున్నామని, చేనేత బీమాలో పేరు నమోదు చేసుకొని వాళ్ళు చేసుకోండని, నేతన్నలకు ఇచ్చే ఆసరా పింఛన్ ను 200 నుంచి 2016 రూపాయలు ఇస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,500 మంది చేనేత రుణమాఫీ చేసామన్నారు. మరోసారి అవసరం అయితే ఆ దిశగా ఆలోచన చేస్తామని, ఇది చేతల ప్రభుత్వం… చేనేతల ప్రభుత్వమన్నా మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలి…కానీ ఏమీ చేస్తుంది ? మనం కొత్త పథకాలు పెడితే…మోడీ సర్కారు ఉన్న వాటిని రద్దు చేస్తున్నారన్నారు. జాతీయ హ్యాండ్లూమ్ బోర్డును మోడీ సర్కారు రద్దు చేశారు.. ఇలా చేనేతలకు చెందిన అనేక సంస్థలను రద్దు చేశారని, మోడీ మొదటి ప్రధాని… చేనేత ఉత్పత్తలపై 5 శాతం జీఎస్టీ విధించారు… దుర్మార్గమన్నారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీను రద్దు చేయాలని మోడీ సర్కారును డిమాండ్ చేద్దామని, నేను మోడీకి లేఖ రాస్తున్న.. అందరం లేఖలు రాద్దామని, తెలంగాణలో చేనేత రంగం బలోపేతం కోసం ఆడిగాము… కానీ కేంద్రం నుంచి స్పందన లేదని, డిసెంబర్‌లో సొంత జాగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.