తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. అయితే.. సెప్టెంబర్ ప్రారంభానికే ముగియాల్సిన వర్షాలు అక్టోబర్ నెలాఖరవుతున్నా కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. ఈ వర్షప్రభావం ఎగువ రాష్ట్రాల్లోనూ కొనసాగుతుండటంతో.. ఎగువ నుంచే వరదకు తెలుగు రాష్ట్రాల్లోని జలశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో ప్రాజెక్టులత గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీలోని అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనంతపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో అక్కడి ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read : Swamy Goud : బీజేపీకి స్వామి గౌడ్ రాజీనామా.. బండి సంజయ్‌కి రాజీనామా లేఖ
అయితే.. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో.. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు, వంట సామాన్లు సైతం నీటిపాలయ్యాయి. ఈ వర్షాలతో తీవ్ర నష్టం చవిచూసామని లోతట్టు ప్రాంతాల ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. తాజాగా వాతావరణ హెచ్చరికల ప్రకారం.. రానున్న కొద్ది గంటల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురియనుంది. ముందుగా నగరంలోని కాప్రా నుంచి మొదలు నగరమంతా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఈ సీజన్‌కు ఇదే ఆఖరి వర్షం కూడా అని పేర్కొనడం విశేషం.