High Court green signal for Bandi Sanjay’s 5th installment of Padayatra: కరీంనగర్ జిల్లా బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర బహిరంగ సభపై కొనసాగుతున్న వాదోపవాదాలకు స్పందించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బైంసాలోకి పాదయాత్ర వెల్లట్లేదని బీజేపీ లాయర్లు కోర్టుకు తెలిపారు. పాదయాత్రకు బీజేపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. మరికొద్దిసేపట్లో కరీంనగర్ నుండి బైంసాకు బండి సంజయ్, బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. బైంసా సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న హైకోర్టు.. బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొంసాగించాలని షరతు పెట్టింది. కోర్టు తుదితీర్పు నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Plane Crash In Montgomery: విమానం కుప్పకూలింది.. 90 వేల ఇళ్లకు పవర్ పోయింది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొన్న సందర్భంలో షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారిన విషయం తెలిసిందే.. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ పాదయాత్రపై మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. ఐదో దశ పాదయాత్ర ప్రారంభానికి బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఫడ్నవీస్ రాకపై కూడా డైలమా నెలకొన్న బీజేపీ నేతలకు ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయని, పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని కాషాయ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇవ్వడంతో కాషాయి శ్రేణుల్లో పాదయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి.
Dasyam Vinay Bhasker: బీజేపీది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర