నందమూరి బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అంత హిట్ ను అందుకుంది.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ విజయం సాధించారు.. వరుస హిట్ సినిమాలు బాలయ్య ఖాతాలో పడటంతో ఫ్యాన్స్ ఫుల ఖుషిలో ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది.. ఇప్పటికి సినిమా కలెక్షన్స్ తగ్గలేదు..
ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతుంది.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా NBK 110 ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాలకృష్ణ 110వ సినిమా అని ఒక పోస్టర్ వైరల్ గా మారింది.. బాలయ్య యుద్ధంలో ఉండే ఒక రాజు గెటప్ లో సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ పోస్టర్ లో కనపడుతున్నారు. పోస్టర్ పై బాలయ్య 110 అని వేసి #BattleofBreaths అనే హ్యాష్ ట్యాగ్ కూడా వేశారు.
అంతకుముందెప్పుడు కనపడని రోల్ లో మన బాలయ్య కనపడబోతున్నారు అని ఈ పోస్టర్ ని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్నారు. అయితే అధికారికంగా ఈ సినిమా గురించి ఎక్కడా బాలకృష్ణ 110 వ సినిమా ప్రకటించలేదు. మరి ఈ పోస్టర్ కథేంటి, ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఇది అభిమానులు చేసిన పోస్టరా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ మాత్రం ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది… ఆ పోస్టర్ గురించి మరిన్ని టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
కొత్త పోస్టర్ కేక పుట్టిస్తోంది, ఎలాంటి సినిమానో తెలీదు కానీ,
మిగిలిన విషయాల కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నాం.!!#BattleOfBreaths pic.twitter.com/kBeTXr90nt
— Ramesh Bala (@rameshlaus) November 4, 2023