మోడీ పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి జరగదు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తూ ఉండదు…వెనకస్తూ రాదన్నారు. మోడీ పాలనలో అభివృద్ధి జరిగింది అంటే అది దళారులకు దోచిపెట్టడమేనన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌కు బీజేపీ 100 మైళ్ల దూరంలో ఉందన్నారు. 25 ఏళ్ల పాలనలో గుజరాత్ ఇంటింటికి మంచినీరు అందించలేదు.
Read Also: సీఎం జగన్‌ను నిద్ర లేపడానికే వచ్చాను: అరుణ్ సింగ్
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు ఇస్తున్న ఫించన్ ఎంత అని ప్రశ్నించారు. రైతు భీమా పేరుతో 15 వేల కోట్లు రైతులకు పెట్టుబడిగా అందిస్తున్నది ఒక్క తెలంగాణాలోనే అని మంత్రి చెప్పారు. వేల కోట్ల ప్రీమియంతో రైతుకు భీమా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ను ఎప్పుడో పాతరపెట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.