ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన DNAలో బీజేపీ పై పోరాటం చేసేది ఉన్నది అని రాహుల్ గాంధీ అన్నారని.. రేవంత్ రెడ్డి DNA లో ఏమి ఉన్నది అని రాహుల్ గాంధీని అడుగుతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
Read Also: Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా 210 మంది.. ఇజ్రాయిల్ సైన్యం ప్రకటన..
కాంగ్రెస్ పార్టీలో 45 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సోనియా గాంధీని తిట్టిన రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా పెట్టి.. రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు గాలి ఎక్కడ ఉన్నది ? సక్కగా అభ్యర్థులే లేరని విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కరెంట్ రావడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారని హరీష్ రావు అన్నారు.
Read Also: Bussiness Idea : అతి తక్కువ సమయంలోనే రూ.10 లక్షలు సంపాదించవచ్చు..
కేసీఆర్ తెలంగాణ పాలనను దేశం ఆచరిస్తుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ స్కీమ్ లను కాపీ చేసిందని విమర్శించారు. కేసీఆర్ కు పనితనం ఉన్నది…పగతనం లేదన్నారు. అదే ఉంటే నోటుకు ఓటు కేసులో రేవంత్ జైల్ లో ఉండేవారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు పగలేదు… ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, మతం మంటలు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లెహర్ లేదు…ఉన్నది జహర్ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.