ప్రస్తుతం ఉద్యోగం చేసేవారి కంటే వ్యాపారం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. యువత ఈ మధ్య వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చెయ్యడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు..రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే ఆరు నెలల సమయంలోనే లక్షల ఆదాయాన్ని పొందుతూన్నారు..
వెల్లుల్లి వాణిజ్య పంట.. దీనికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, కీళ్లనొప్పులు, నపుంసకత్వము, రక్త వ్యాధులకు కూడా వెల్లుల్లిని వాడుతారు. యాంటీ బ్యాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఔషధాల తయారీలో కూడా వీటిని వినియోగిస్తారు.. పచ్చిగా ఉన్నవాటికన్నా ప్రాసెస్ చేసిన వాటిని ఎక్కువగా అమ్ముతున్నారు.. ఇలా డబ్బులను ఎక్కువగా సంపాదిస్తున్నారు..
పంట నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. వెల్లుల్లి ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. క్వింటాల్‌కు 10000 నుంచి 21000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40000 వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మీరు ఒక ఎకరం భూమిలో రియా అటవీ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా సులభంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు… వాటిని పొడిగా చేసి అమ్మితే మరింత ఎక్కువగా లాభాలను పొందుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..