Harish Rao: ఓటమి తప్పదు.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. అబద్ధాలు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 14 లక్షల నుండి 56 లక్షల ఎకరాలకు వరి సాగు పెరిగిందని మంత్రి తెలిపారు. ఇంత పంటకు కారణం అల్లావుద్దీన్ మ్యాజిక్ కాదు.. 24 గంటల కరెంట్,రైతు భీమా,సాగు నీరు అందించటమే కారణమన్నారు.
ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయమన్న మంత్రి.. కరువు అనే పదాన్ని డిక్షనరీలో తొలగించిన నాయకుడు కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అయితే గోదాంలు పెట్టి ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పండిన పంట కొంటాం, నష్టపోయిన రైతులను కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వరి పంట వేయ్యొద్దంటు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని.. కానీ తెలంగాణలో 7100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక భూమికి విలువ పెరిగిందన్నారు. రాష్ట్రం మొత్తం ఆయిల్ ఫాంను విస్తరిస్తున్నామన్నారు. తెలంగాణలో బీజేపీ రాదని, కర్ణాటకలో ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థం అయ్యిందని.. అందుకే అమిత్ షా ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. అమిత్ షా దెయ్యాలు వేదాలు వల్లించునట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
Also Read
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
Read Also: YS Sharmila: పోలీసులతో వైఎస్ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..
పేపర్ లీకేజీలో ఉన్న దొంగలను, బెయిల్ మీద వచ్చిన వాళ్లను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. హామీ ఇవ్వకుండా ఎన్నెన్నో పథకాలు కేసీఆర్ తీసుకువచ్చారని ఈ సందర్భంగా హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే లంచాలు, అవినీతి,పదవులు కోసం ఆలోచించే పార్టీ అని.. ప్రజలే హైకమాండ్‌గా పనిచేసే పార్టీ బీఅర్ఎస్ పార్టీ అని మంత్రి తెలిపారు. ఢిల్లీ పెద్దలకు గులాంగా పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్ పెద్దలకు గులాంగా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి విమర్శించారు. 1 కోటి 17 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి 30 లక్షల మంది కళ్లద్దాలు ఇచ్చామన్నారు. తండ్రిలా ఆలోచిస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఊరికి వెళ్ళినా ప్రతి రోజు నీళ్ళు వస్తాయని.. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా.. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బాగుందా చర్చ పెట్టాలన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. పేదలకు వైద్య,విద్యను తీసుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. సీతారామ నీళ్లను జిల్లాలోని ప్రతి గ్రామానికి తీసుకువస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. కాలంతో పని లేకుండా సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో సాగు నీరు అందిస్తామన్నారు. మూడు,నాలుగు నెలల్లో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో రైతుల కాళ్ళు కడుగుతామన్నారు. అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
తాజావార్తలు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!