Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
- ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)కి చెందిన 6 మంది ఎంపీల తిరుగుబాటు.
- ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ.
- తిరుగుబాటు ఎంపీలు షిండే శివసేనలో చేరే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఎంపీలు బిగ్ షాక్ ఇచ్చారు. 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి, వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ ఆరుగురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్చౌరే, సంజయ్ దిన పాటిల్ ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు బుధవారం నాందేడ్, పూణే, ముంబైల నుంచి ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కూడా ఢిల్లీకి వచ్చి, స్పీకర్‌కు మద్దతు లేఖను సమర్పించారు. తిరుగుబాటు ఊహాగానాల నేపథ్యంలో, ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ సంజయ్ రౌత్ ఢిల్లీ నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేన(యూబీటికి) చెందిన ఎంపీలు అవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ ఉన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
మా ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నేత నేతృత్వంలోని శివసేన కాగడా గుర్తపై ఎన్నికయ్యారుని, వారు ప్రధాని మోడీ పేరు మీద గెలవలేదని, ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని వదిలిపెట్టేది లేదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. వెళ్లాలనుకునే వారు రాజీనామా చేసి వెళ్లవచ్చని అన్నారు. మరోవైపు, ఈ తిరుగుబాటుపై ఎంపీలపై విలేకరుల సమావేశంలోనే రౌత్ బూతుల వర్షం కురిపించడం వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..