Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ సరికొత్త వినూత్న ప్రయోగాలకు నాంది పలికే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన గోల్డెన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సింగ్ గీతం’. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమా కాన్సెప్ట్ గురించి సింగీతం మాట్లాడుతూ.. “సుమారు 40 ఏళ్ల క్రితం నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా, సినిమాలోని ప్రతి సంభాషణను మాట్లాడకుండా కేవలం పాట రూపంలోనే చెప్పాలని అనుకున్నాను. సాధారణంగా బ్రాడ్వే మ్యూజికల్స్‌లో పాటలు, మాటలు వేరువేరుగా ఉంటాయి. కానీ నేను మాత్రం ప్రతి డైలాగ్‌ను పాడుతూ చెప్పేలా ఒక సినిమా చేయాలని కలగన్నాను. ఆ ఆలోచన నాతోనే దాదాపు 40 ఏళ్లు ప్రయాణించింది. చివరికి నాగశ్విన్ దృష్టికి ఈ కథ వెళ్లడం, ఆయన దీన్ని ఎంతో ఇష్టపడి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. నాగశ్విన్ ఇచ్చిన నమ్మకం, సంపూర్ణ సహకారం లేకపోతే ‘సింగ్ గీతం’ ఈరోజు రూపం దాల్చేది కాదు” అని చెప్పుకొచ్చారు.
Also Read
దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టడంపై స్పందిస్తూ.. “నాగశ్విన్ ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించాలని కోరారు. నాలో ఇప్పటికీ ఆ ఉత్సాహం ఉంది. అయితే నా వయస్సు (94 ఏళ్లు) దృష్ట్యా లైవ్‌గా సెట్స్‌కు రావడం కష్టం కాబట్టి, సాంకేతిక సహకారంతో సరికొత్త ఆన్లైన్ విధానాన్ని నాగశ్విన్ ఏర్పాటు చేశారు. నేను నా ఇంట్లోని హోమ్ థియేటర్లో కూర్చుని, షూటింగ్ లొకేషన్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మానిటర్లలో ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సూచనలు ఇచ్చేవాడిని. అక్కడి కెమెరాలన్నీ నా హోమ్ థియేటర్‌కు కనెక్ట్ అయి ఉండేవి. ఇలా ఇంట్లో నుంచే మొత్తం సినిమాను డైరెక్ట్ చేయడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. ఇలాంటి సరికొత్త టెక్నాలజీ మేనేజ్మెంట్ను సాధ్యం చేసింది కేవలం నాగశ్విన్ మాత్రమే” అని లెజెండరీ డైరెక్టర్ కొనియాడారు.
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!