Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్లాసిక్ మేకర్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో అందించిన సరికొత్త అద్భుతం ‘సింగ్ గీతం’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రతి డైలాగ్‌ను పాడుతూ చెప్పే సరికొత్త ప్రయోగాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశారు సింగీతం. ఈ సందర్భంగా ఆయన నటీనటుల ఎంపిక, స్టార్ హీరోల నటనా శైలిపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినీ చరిత్రలో కమల్ హాసన్, డా. రాజ్‌కుమార్, నందమూరి బాలకృష్ణ లాంటి ఎందరో మహానటులతో పనిచేసిన అనుభవంపై సింగీతం స్పందించారు. “పరిశ్రమలో ప్రతి నటుడికి తనదైన ఒక ప్రత్యేక శైలి, వ్యక్తిత్వం ఉంటాయి. బాలకృష్ణ గారు కమల్ హాసన్ గారిలా ఉండరు.. అలాగే కమల్ హాసన్ గారు కన్నడ లెజెండ్ డా. రాజ్‌కుమార్ గారిలా నటించరు. ముగ్గురూ అసాధారణమైన ప్రతిభావంతులే అయినప్పటికీ, వారి యాక్టింగ్ స్టైల్స్ పూర్తిగా భిన్నం. ఒక దర్శకుడిగా నా బాధ్యత ఏంటంటే.. ఏ నటుడిలో ఉన్న ప్రత్యేకతను ఆ నటుడి నుంచే అత్యుత్తమంగా రాబట్టడం. ఒకరి శైలిని మరొకరిపై రుద్దకుండా, వారిలోని ఒరిజినల్ టాలెంట్‌ను వెండితెరపై ప్రెసెంట్ చేయడమే నా సినిమాల విజయానికి ప్రధాన కారణం” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read
‘సింగ్ గీతం’లో ఎక్కువగా కొత్త నటీనటులను తీసుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని సింగీతం బయటపెట్టారు. “ఈ సినిమా మ్యూజికల్ డ్రామాగా సాగుతుంది కాబట్టి కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రంలో నటించిన ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి వంటి ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు సంబంధించిన పాటలను, సంభాషణలను స్వయంగా పాడుకున్నారు. సాధారణ సినిమాల్లా ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్స్ లేరు. ఇక్కడ నటించిన వారే గాయకులు కూడా అయ్యారు. పాత్రలోని భావాలను నటీనటులు స్వయంగా ఆలపించడం వల్లే సినిమాకు ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది” అని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు ఈ ప్రయోగాన్ని మరింత రక్తికట్టించాయి.
తాజావార్తలు
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!