Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
- ఉద్ధవ్ శివసేనలో ఎంపీల తిరుగుబాటు..
- తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు ఢిల్లీకి..
- ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్‌ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది.
ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, పార్టీని వీడాలనుకునే ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు. తీవ్రస్థాయిలో బూతులు తిట్టాడు. ఈ వెధవలు వెళ్లిపోవాలి అని ఆగ్రహంగా అన్నారు. ద్రోహం చేయడం వారి రక్తంలో ఉందని దుయ్యబట్టారు. తన తిట్లను బీప్ చేయవద్దని కోరుతూనే, మరాఠీలతో ఇలాంటి పదజాలం వాడటం సాధారణమే అని అన్నారు. తప్పు చేసిన వారిపై, అవినీతికి పాల్పడిన వారిపై మనం పూలు కురిపిస్తామా.? అని ప్రశ్నించారు.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ఇదే కాకుండా, ఎంపీలను డబ్బులతో కొంటున్నారని మండిపడ్డారు. తిరుగుబాటు చేయడానికి ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, కొందరు ఎంపీలు పక్షం మారేందుకు రూ. 50 కోట్లను కూడా ఆఫర్ చేస్తు్న్నారని ఆరోపించారు. ఎంపీల కొనుగోలు ప్రయత్నంపై మంగళవారం రాత్రి ఒక వ్యక్తి తనకు సమాచారం ఇచ్చారని, రూ. 50 కోట్లలో, రూ. 15 కోట్లు ఈ రాత్రికి అందుతాయని, డబ్బు చేతికి అందిన తర్వాతే ఎంపీలు విమానం ఎక్కారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?