UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- దేశంలో కొనసాగుతోన్న రాజకీయ ఫిరాయింపులు
- సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి
- కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలిక తప్పదని.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రపైనే దృష్టి పెట్టొద్దని.. ఇప్పుడు యూపీ వంతు వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఏఎన్ఐతో మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా కొనుగోలు కావడానికి సిద్ధంగా ఉంటేనే వారిని ఎవరైనా కొనుగోలు చేస్తారు. మహారాష్ట్ర గురించే కాకుండా ఉత్తరప్రదేశ్‌పై కూడా దృష్టి పెట్టండి’’ అని అన్నారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో కొంతమంది ఎంపీలు తిరుగుబాటు చేశారనే వార్తలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన పలువురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ఓపీ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
समाजवादी पार्टी में बड़ी टूट होगी। राम गोपाल यादव ने केंद्रीय गृहमंत्री अमित शाह जी को चिट्ठी सौंपी है।
खनन घोटाला और गोमती रिवर फ्रंट घोटाला का मास्टरमाइंड कौन है, पूरा उत्तर प्रदेश जानता है। शिकंजा कस रहा है तो सपा परेशान है।
महाराष्ट्र बंगाल छोड़िए, समूची सपा, भाजपा में…
— Om Prakash Rajbhar (@oprajbhar) June 17, 2026
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!