మునుగోడు ఉప ఎన్నికలో పార్టీల మధ్య వాడివేడిగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే నేడు.. నల్లగొండ జిల్లా మర్రిగుడలో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిగూడ మండలానికి నన్ను ఇన్చార్జిగా పంపడం నా అదృష్టంగా భావిస్తున్న. మునుగోడులో ధర్మం, న్యాయం గెలుస్తుంది.. మూడు నెలలకు ఒకసారి మర్రిగూడ వస్తా మీ సమస్యలు పరిష్కరిస్తా.
Read ALso: రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర కోసం ఈ నియమాలను పాటించండి
స్థానిక ప్రజా ప్రతినిధులు అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను నా ముందు ఉంచారు.. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తా. డబ్బు, మద్యంతో ఓట్లు కొనుగోలు చేయవచ్చన్న ధైర్యంతో మీ ముందుకు వస్తున్నారు వారి మెడలు వంచండి…అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్ కు పటంకట్టాలి.. దుబ్బాక, హుజరాబాద్ లో కూడా ఇలాగే అబద్ధాలు చెప్పారు బీజేపీ నేతలు..
బీజేపీకి ఓటు వేస్తే పెరిగిన ధరలకు అంగీకారం తెలిపినట్లే… రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలిస్తే కేసీఆర్ ను, మంత్రులను తిట్టుకుంటూ తిరుగుతాడు.. ప్రభాకర్ రెడ్డినీ గెలిపిస్తే మర్రిగూడ అభివృద్ధికి నేను బాధ్యత తీసుకుంటా. కొద్దిరోజుల్లోనే శివన్నగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేస్తాం. చర్లగూడెం ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకుంటాం. మునుగోడు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.. ఫ్లోరైడ్ ఇబ్బందులను తీర్చిన ఏకైక వ్యక్తి, నేత కేసీఆర్…ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించి… మర్రిగుడ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Read ALso: Sukesh Gupta: MBS జ్యూయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా అరెస్ట్.. భారీగా బంగారం సీజ్