విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అధికారం కొంత మంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థ రహితం అంటూ ఆయన మండిపడ్డారు. బీసీ మంత్రులమైన మాకు వ్యక్తిత్వం లేదా? ఆత్మాభిమానం లేదని ప్రతిపక్షాలు చెప్పదలచుకున్నాయా?.. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా, ఆత్మాభిమానంతో మంత్రులుగా మా విధులను నిర్వర్తిస్తూ ఉన్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వేసుకున్న ముసుగులు తీసి వేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Read Also: Health Tips: ముక్కు దిబ్బడ నివారణకు ఆయుర్వేద నివారణలు..!
తమ ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. .ఇదేమీ కొత్త కాదు.. పరిమితులు దాటితే కేంద్ర ప్రభుత్వమే అంగీకరించదు అని ఆయన తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ 600 హామీలు ఇచ్చింది.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ఫైళ్లపై సంతకం చేశారు.. వాటిలో ఒకటైన నెరవేర్చరా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ముసుగులు తొలగించుకుని మళ్లీ జనం ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిందితుడు.. బలహీన వర్గాలకు చెందిన మంత్రులుగా మాకు వ్యక్తిత్వాలు లేవా, మేమే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చామా? అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్ లో యువతి దారుణ హత్య..
కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు కొన్ని పత్రికలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏరు దాటే వరకు ఓడమల్లన్నా.. ఏరు దాటాక బోడి మల్లన్న అనేది టీడీపీ పాలన జరిగిన తీరు.. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా ప్రజల ముందుకు వచ్చాము అని ఆయన పేర్కొన్నారు. రెండు వంతుల మందికి పాలనలో భాగస్వామ్యం కల్పించింది వైసీపీ ప్రభుత్వం అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.