Minister Botsa Satyanarayana: గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో పెద్ద కుట్ర, కుతంత్రం జరుగుతోందని ఆయన అన్నారు. పేదవాడు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నారని.. పేదోడికి న్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు జరుగుతున్నాయని మంత్రి మండిపడ్డారు. దోపిడి రాజ్యం రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు.
Also Read: Rahul Gandhi: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలి..
వ్యవస్థలను మేనేజ్ చెయటంలో పెద్ద దిట్ట అని.. నేడు మనల్ని విమర్శిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గతంలో దొంగతనం, దోపిడి చేసి దోచుకున్నారని.. వ్యవస్థలలో లొసుగులతో, చట్టాలలో లోపాలతో తప్పుకున్నారని ఆయన ఆరోపించారు. నేడు జగన్ ప్రభుత్వం చేసిన తప్పును, దోపిడినీ పకడ్బందీగా న్యాయస్థానం ముందు పెట్టిందన్నారు. ఒంట్లో, కంట్లో బాలేదు , చర్మ వ్యాధి వచ్చిందని కోర్టులో చెప్పారని.. పదికాలాల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలనే తాము కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ వారు ఏం పీకుతారు అన్నారని , అవినీతి అన్యాయం చేసి కబుర్లు మాటాడితే ఎం జరిగిందో చూసారు కదా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సామాన్యులు, పేదవారి గురించి, రైతు గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించరని ఆయన అన్నారు. చంద్రబాబు డబ్బులు ఇస్తే ఓటేస్తారనుకోవడం పొరపాటు , ప్రజలు చాలా తెలివైనవారని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Kishan Reddy : తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..” దొంగోడు జైల్లొంచి వస్తే ఆనందపడాలా..?. కేసు కొట్టేస్తే పోనీ అని ఆనంద పడాలి.. కానీ లేనివి ఉన్నట్లు లేనివి ఉన్నట్లు చెప్పే కుట్ర జరుగుతోంది.సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయం గురించి ప్రజలకు తెలియ చెప్పాలి. అంబేడ్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపనకు జరుగుతున్న కృషి తెలియజేయాలి. మంత్రి పదవులు సహా అన్నింటా సామాజిక న్యాయం అందిస్తున్నాం. గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు కాకుండా అవినీతి లేకుండా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాం.” అని మంత్రి అన్నారు.