పోలవరంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా పోలవరం నిర్మాణం వివాదంపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేంద్రం నుండి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించామని,
తెలంగాణ నాయకులు ఎందుకు కొత్త వాదన చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆయన విమర్శించారు.
తెలంగాణ నేతలు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూర్చుని చర్చించుకోమని చెప్పిందని, ఈ నెలలోనే పోలవరంపై ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు మిత్ర రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులతో సమావేశమవుతామన్నారు.
ముంపు గ్రామాలను వెనక్కి తిరిగి ఇచ్చేయాలన్న తెలంగాణ నేతల వాదన అర్థం లేనిదని, చర్చల ద్వారా తెలంగాణ నేతల అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. పోలవరం నిర్మాణం విషయంలో ఈ నెలలోని నిపుణులతో కలిసి సమావేశం అవుతామని ఆయన వెల్లడించారు.