మెగాస్టార్ కోసం 726 కి.మీ. పాదయాత్ర చేసిన దివ్యాంగుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయినా అభిమాన హీరోను చూడాలన్న ఆశను మాత్రం చంపుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆరాధ్య హీరో కోసం సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్దకు చేరుకున్నాడు.

అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు 23 రోజుల్లో గంగాధర్ 726 కిలోమీటర్ల మేర నడిచాడు. దీంతో గంగాధర్ పాదయాత్ర విషయం మెగాస్టార్ చిరంజీవి చెవిన పడింది. దివ్యాంగుడు తన పట్ల చూపించిన అభిమానానికి ఆయన కదిలిపోయారు. వెంటనే గంగాధర్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. తనపై అభిమానాన్ని అతడి మాటల్లో విన్న చిరంజీవి ముగ్ధుడయ్యారు. అయితే తనకోసం అతడు వందల కిలోమీటర్లు నడిచి రావడం పట్ల మెగాస్టార్ బాధపడ్డారు. మరోసారి ఇలాంటివి చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. కాగా ఈ పాదయాత్ర ఎందుకు చేశావని చిరంజీవి అడగ్గా… ‘మాస్టర్’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేపట్టినట్టు గంగాధర్ వివరించాడు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Read Also: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!