Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. నేచురల్ స్టార్ నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సినిమా ఎంతటి క్లాసిక్, ప్లెజెంట్ లవ్ అండ్ ఎంటర్టైనింగ్ వైబ్‌తో రాబోతోంది. గత కొంతకాలంగా మాస్, యాక్షన్ జోనర్లలో ప్రయత్నాలు చేసిన నితిన్.. ఈసారి తన బలమైన ‘రొమాంటిక్-కామెడీ / ఫ్యామిలీ’ జోనర్లోకి అడుగుపెట్టారు. నితిన్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచేలా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టాక్. నితిన్‌కు గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చే కంటెంట్ ఇందులో ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. నిర్మాతగా ఎప్పుడూ వైవిధ్యమైన, కొత్త తరహా కథలనే ఎంచుకునే నానికి ఈ సబ్జెక్ట్ ఎంతగానో నచ్చడంతో స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చారు. ప్రొడ్యూసర్‌గా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న నాని జడ్జ్‌మెంట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. దీంతో నితిన్ – నాని – మురళి కాంత్ కాంబినేషన్లో రాబోతున్న ‘అలియాస్ రుక్మిణి’ నితిన్ కు కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 4న ముగ్గురు యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు నితిన్. నాగ చైతన్య వృషకర్మ, విశ్వక్ సేన్ లెగసి కూడా అదే రోజున రాబోతుంది. ఈ పోటీలో అలియాస్ రుక్మిణితో నితిన్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!