Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- పాత మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేస్తుండగా పేలుడు
- నలుగురు CRPF సిబ్బందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (CRPF)కు చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ASI) పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని కొంటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, CRPF 50వ బెటాలియన్‌కు చెందిన అమ్యూనిషన్ టెక్నికల్ టీమ్‌లో ఈ నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు.
తనిఖీలు నిర్వహించడంతో పాటు మిగిలిపోయిన, ఉపయోగించని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు వారు జగదల్పూర్ నుంచి ఎలార్మడుగు క్యాంపునకు చేరుకున్నారు. భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలార్మడుగు భద్రతా శిబిరం సమీపంలో గురువారం సాయంత్రం పాత పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు CRPF సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
గాయపడిన సిబ్బంది వివరాలు
ఎం.కే. తివారీ – అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ASI)
అనీస్ ఖాన్ – అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ASI)
కుల్దీప్ రాజ్ – హెడ్ కానిస్టేబుల్
అమర్నాథ్ మిశ్రా – ఇన్స్పెక్టర్
వీరిలో ASIలు ఎం.కే. తివారీ, అనీస్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వారిని మరో ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, భేజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంపులో CRPF సిబ్బంది సాధారణ విధుల్లో భాగంగా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. పనికిరాని గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని, ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాల శకలాలు తగలడంతో నలుగురు జవాన్లు గాయపడ్డారని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గతంలో నక్సల్స్ కార్యకలాపాలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది.
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!