BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations Case: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగానే ఉందని ధర్మాసనం పేర్కొంది.. బీసీ రిజర్వేషన్ల నిర్ణయంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో ఆశించిన ఫలితం దక్కలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఈ అంశంపై న్యాయపరమైన చర్చ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై ఎలాంటి విచారణ జరుగుతుందనే విషయంలో బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాల ప్రజలపై కూడా ఉత్కంఠ నెలకొని ఉండగా.. సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో పాటు.. బీసీ వర్గాలను నిరూత్సాహపరిచినట్టు అయ్యింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టులో సవాల్ చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయనే కారణంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోలను హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన విషయం విదితమే..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!