పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’లో అకీరా నందన్..?

టాలీవుడ్ లో వారసుల రాక ఎప్పుడో మొదలయ్యింది. స్టార్ హీరోల వారసులు అభిమానులను అలరించడానికి రెడీ ఐపోతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల వారసులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తుంది పవన్ వారసుడు కోసమేనని అందరికి తెలిసిన విషయమే.. ఆరడుగుల అందం.. తీక్షణమైన కంటిచూపుతో.. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్న అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు అకీరా తల్లి రేణు దేశాయ్.. అకీరా టాలీవుడ్ ఎంట్రీ తన ఇష్టమని, తనకెప్పుడు రావాలనిపిస్తుందో అప్పుడే వస్తాడని చెప్తున్నా.. పవన్ మాత్రం వారసుడి ఎంట్రీ గురించి మాట్లాడకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీర మల్లు’ చిత్రంలో అకీరా స్పెషల్ కామియోలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.. ఇందుకోసమే అకీరా కర్రసాము నేర్చుకున్నాడని వార్తల సారాంశం. ప్రస్తుతం 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లో త్వరలో అకీరా సందడి చేయనున్నాడంట. తండ్రి- కొడుకల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్. ఈ వార్తలో నిజం ఎంత ఉన్నది తెలియదు కానీ, ఈ వార్త విన్నాకా పవన్ అభిమానులు, మెగా అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేవనే చెప్పాలి. ఒక వేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లలో ఈ సీన్స్ కి అభిమానుల రచ్చ మాములుగా ఉండదు మరి..

Related Articles

Latest Articles