అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లో లైంగిక వేధింపులు, వేధింపుల జాత్యహంకారంతో మహిళా కార్మికులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రెస్టారెంట్లలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి 100 మంది ఉద్యోగులను ఆరా తీయగా.. ఎక్కువగా మహిళలు ఫిర్యాదు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో పనిచేస్తున్న భారతీయుతో పాటు పాకిస్తాన్ మహిళలు కూడా జాత్యహంకార వేధింపులు ఎదుర్కొన్నారు. అక్కడ పాకిస్థాన్ వారిని ఉగ్రవాది అని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేశారంటూ ఆరోపించారు. విచారణలో ఉద్యోగుల నుంచి వచ్చిన 100 కంటే ఎక్కువ ఆరోపణలు లైంగిక వేధింపులకు సంబంధించినవిగా గుర్తించారు. నిర్వాహకులు తమ జూనియర్ మహిళా ఉద్యోగులతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడాలని ఒత్తిడి చేస్తున్నారని.. ఇది కంపెనీ విధానానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. మహిళల పట్ల విచక్షణరహితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
Read Also: Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష.. కారణం ఇదే?
అయితే, డ్యూటీ టైంలో తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేయడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు 16 ఏళ్ల షెల్బీ చెప్పింది. ఇదే విషయంపై సీనియర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని ఆమె ఆరోపించింది. దీంతో సదరు యువతి రాజీనామా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ షెల్బీకి క్షమాపణలు చెప్పింది. అలాగే, ఆమె లేవనెత్తిన సమస్యలను ఎందుకు పరిశీలించలేదో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. యూకేలో మెక్‌డొనాల్డ్స్ అతిపెద్ద ప్రైవేట్ రంగంగా ఉంది. 1,450 రెస్టారెంట్లలో 170,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు 16-25 సంవత్సరాల మధ్య వయస్సుల గల వారే ఉన్నారు. అయితే, మెక్‌డొనాల్డ్స్ లో జరుగుతున్న లైంగిక, జాత్యహంకార వేధింపులతో ఆ కంపెనీ మూసి వేసే పరిస్థితి నెలకొంది.
Read Also: Actress Pragathi Viral Video: నిజంగానే ఆ పని చేసేంది.. టార్గెట్ పెద్దదే..