Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. పరువు నష్టం కేసులో దంపతులకు జైలుశిక్ష ఖరారైంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు ఒకానొక మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేశారు. దీనిపై కోర్టు తన తీర్పు ప్రకటించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే.. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపించారు.
Read Also:Actress Pragathi Viral Video: నిజంగానే ఆ పని చేసేంది.. టార్గెట్ పెద్దదే..
దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ దానిపై కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం కేసు వేశారు. వారు చేసిన ఆరోపణలకు సబంధించిన వీడియోతో పాటు.. మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టు ముందు ఉంచారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో… ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరికి 10 చొప్పున పూచీకత్తులను సమర్పించగా కోర్టు పై కోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ దంపతులకు బెయిలు మంజూరు చేసింది.
Read Also:Sri Ramana Died: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత!