సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. పాశమైలారంలోని పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో.. పరిశ్రమ చుట్టూ దట్టంగా పొగ అలుముకుంది. పరిశ్రమలో పని చేస్తున్న నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమలో పేలుడు ధాటికి పైకప్పు ఎగిరిపడింది. చెల్లాచెదురుగా రేకులు పడిపోయాయి.
Also Read : Wrestlers Protest: సమస్యలు పరిష్కారమైతేనే ఆసియా గేమ్స్ లో పాల్గొంటాం.. రెజ్లర్ల అల్టిమేటం
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. అయితే.. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులని హైదరాబాద్ కి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత యాజమాన్యం పరారీలో ఉంది. మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు NV రెడ్డి, సత్యానంద్ గా గుర్తించారు. మరో ఇద్దరు ఎవరు అని ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read : Karnataka High Court: అనుమానంతో భార్య, పిల్లల హత్య.. చనిపోయేదాకా ఉరితీయాలని కోర్టు తీర్పు..