Marriguda Chain Snatcher: నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచర్ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. స్కూటీలో ఇద్దరు కలిసి ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు దొంగలించి అక్కడి నుంచి పరారైన దృష్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో ఈ వార్త వైరల్ గా మారింది. కొందరు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా జోట్ స్పీడ్ లో స్కూటీపై పరారైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బైక్ నెంబర్ సహాయంతో ఫోన్ నెంబర్ ను తెలుసుకుని చాకచక్యంగా వారిని అదుపులో తీసుకుని దొంగతనం చేసింది లవర్స్ కాదని.. నిందితులిద్దరు భార్యభర్తలని గుర్తించారు.
Read also: Bat Symbol Case: పాకిస్థాన్ లో బ్యాట్ సింబల్ గుర్తు కేటాయింపుపై వివాదం..
నల్లగొండ జిల్లా మర్రిగూడ చైన్స్ స్నాచర్ కు పాల్పడిన వారు ఇద్దరూ భార్య భర్తలుగా గుర్తించారు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకున్నట్లు తెలిపారు. నిన్న సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట.. సునీత మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. స్థానికులు వెంబడించడంతో.. అక్కడి నుండి హైదరాబాద్ కి పారిపోయారు. సంతోష్ నగర్ వద్ద స్కూటీ పై పారిపోతున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఇద్దరు వెంకటేష్, అతని భార్య గా పోలీసులు గుర్తించారు. వ్యసనాల అలవాటై చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బండి నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ గుర్తించారు. అనంతరం సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నారు. ఇంకా ఎక్కడైన దొంగతనానికి పాల్పడ్డారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Magunta Srinivasulu Reddy: వైసీపీ సీటు ఇవ్వకుంటే ఏం చేద్దాం..? అనుచరులతో మాగుంట మంతనాలు..