Nestle: చిన్నారులు ఆహర ఉత్పత్తుల సంస్థ నెస్లే, నిబంధనలను ఉల్లంఘిస్తూ తన ప్రోడక్ట్స్‌లో చక్కెరను జోడిస్తున్నట్లు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనల్లో వెల్లడించిండి. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలకు ఇచ్చే ఫుడ్ ప్రోడక్టుల్లో చక్కెరను మినహాయిస్తుందని, అయితే భారత్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో మాత్రం చక్కెర, తేనే జోడిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. చిన్న పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల్లో చక్కెర వినియోగించడం నిషేధం, అయితే నెస్లే మాత్రం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఇది ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కారణమవుతోందని తెలుస్తోంది.
Read Also: Ajit Pawar: ‘ద్రౌపది లాంటి పరిస్థితి వస్తుంది’.. వివాదాస్పదమైన అజిత్ పవార్ వ్యాఖ్యలు..
అయితే, ఈ ఆరోపణలపై నెస్టే స్పందించింది. గత 5 ఏళ్లలో 30 శాతం చక్కెర జోడించడాన్ని తగ్గించామని, పోషకాహార నాణ్యతపై ఎప్పుడూ రాజీపడలేదని పేర్కొంది. తమ సెరిలాక్ ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కార్బో హైడ్రేడ్లు, విటమిన్స్, మినరల్స్, ఐరన్ మొదలైన పోషకాహారాల విలువలను సముచితంగా అందచేస్తున్నామని చెప్పారు. మేము పోషకాహార విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని, మా ఉత్పత్తుల్లో పోషకాహార ప్రొఫైల్‌ని మెరుగుపరచడానికి మా విస్తృతమైన గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నెట్వర్క్ నిరతరం పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైన పోషకవిలువల విషయంలో కంపెనీ రాజీపడదని నెస్లే ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు.
జర్మనీ, యూకేలో చక్కెర జోడించకుండా నెస్లే తన ఉత్పత్తులను అమ్ముతున్నప్పటికీ, భారతదేశంలో విక్రయించే 15 సెరెలాక్ బేబీ ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల చక్కె ఉంటుందని నివేదికలు వెల్లడించాయి. మరోవైపు ఇథియోపియా, థాయ్‌లాండ్‌లలో దాదాపుగా 6 గ్రాముల చక్కె ఉంటుందని తేలింది. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లోని పోషక సమాచారంలో యాడెడ్ షుగర్ మొత్తాన్ని తరుచుగా బహిర్గతం చేయడం లేని నివేదిక పేర్కొంది. ఈ ఆరోపణల్ని పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. వాటిని సైంటిఫిక్ ప్యానెల్ పరిశీలిస్తోందని ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.